Pawan director work in kalyandev second movie
Pawan director work in kalyandev second movie
![]() |
kalyandev |
విజేత’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మెగా అల్లుడు కల్యాణదేవ్ తన నెక్స్ట్ మూవీపై ఫోకస్ పెట్టారు. మెగాస్టార్ అల్లుడిగా, మెగా ఫ్యామిలీ హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ఈ మెగా అల్లుడు తొలి చిత్రంతో హీరోగా నిలదొక్కుకునేందుకు గట్టి ప్రయత్నమే చేశారు. తండ్రి ఆశయాన్ని నెరవేర్చే కొడుకుగా ‘విజేత’ కావాలని ఆకాంక్షించాడు. మొత్తంగా మెగా హీరో అనే తాపత్రయానికి పోకుండా కథా ప్రాధాన్యత ఉన్న చిత్రంలో నటించి.. హీరోయిజం కోసం వెంపర్లాడలేదు కళ్యాణ్ తేజ్. ఇక ‘విజేత’ సినిమా సంగతి అటుంచితే.. తన రెండో సినిమాలో హీరోయిజంతో పాటు మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకునే ఎలిమెంట్స్‌తో యాక్షన్ కమర్షియల్ మూవీకి మెగా కాంపౌండ్ ప్లాన్ చేస్తోందట. అందుకోసం యంగ్ కమర్షియల్ డైరెక్టర్, గబ్బర్ సింగ్ మూవీ దర్శకుడు హరీష్ శంకర్‌తో టచ్‌లో ఉన్నారట కళ్యాణ్ దేవ్.
No comments