aa director tho naku godavaindi
aa director tho naku godavaindi
![]() |
AKHIL |
అఖిల్, నిధి అగర్వాల్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా లండన్‌లో చీత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమా షూటింగులో వెంకీకి, అఖిల్‌కు మధ్య అభిప్రాయ బేధాలు నెలకొన్నాయని, దీంతో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయే పరిస్థితి ఏర్పడిందని, వార్తలు వస్తున్నాయి .‘తొలిప్రేమ’ సినిమాతో మంచి హిట్ కొట్టిన దర్శకుడు వెంకీకి ఇది రెండో సినిమా. ‘హలో’ పరాజయంతో ఉన్న అఖిల్.. వెంకీ సినిమాతో హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. అయితే, ఈ సినిమా కథలో అఖిల మార్పు చేర్పులు చేశాడని, వెంకీ మనసు చంపుకుని అఖిల్ వెర్షన్‌ను కథలో చేర్చి షూటింగ్ చేస్తున్నాడనే రూమర్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ విషయం అఖిల్, వెంకీలకు కూడా చేరింది. దీంతో అఖిల్ వారి మధ్య ఏం జరిగిందో చెప్పడం మొదలుపెట్టాడు. ‘‘వెంకీకి నాకు క్రియేటివ్ విషయంలో బేధాలు వస్తున్నాయట. కానీ ఆయన డైరెక్టర్ కాబట్టి ఆయన ఏం చెబితే అది నేను చేస్తున్నాను. ఇది కరెక్ట్ న్యూస్ అని చెప్పడానికి ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాం.’’ అంటూ ఇద్దరూ ఒక్కసారే పగలబడి నవ్వారు. అనంతరం అఖిల్ వెంకీకి ముద్దుపెట్టి.. తమ మధ్య ఏదీలేదనే విషయాన్ని స్పష్టం చేశారు.
No comments