Breaking News

TOLLY WOOD LO MARO MULTISTARAR


TOLLYWOOD LO MARO MULTISTARAR





టాలీవుడ్ లో  చాల కలం తర్వాత వెంకటేష్, మహేష్‌బాబులతో ధైర్యంగా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు’ అనే కుటుంబ కథాచిత్రాన్ని తీసిన నిర్మాత దిల్ రాజు. ఈ చిత్రంలో మళ్లీ మల్టీస్టారర్‌లకు దిల్ రాజు నాంది పలికారు. ఇప్పుడు వరసగా మల్టీస్టారర్లు వస్తున్నాయి. ఇప్పటికే వెంకటేష్, వరుణ్‌తేజ్‌లతో ‘ఎఫ్2’ పేరుతో దిల్‌ రాజు మరో మల్టీస్టారర్‌ను నిర్మిస్తున్నారు. ‘ఫన్ అండ్ ఫ్రస్టేషన్’ అనేది ఉపశీర్షిక. ఇదికాకుండా మరో మల్టీస్టారర్ చిత్రాన్ని దిల్ రాజు పట్టాలెక్కిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ‘అష్టాచ‌మ్మా’, ‘గోల్కొండ హైస్కూల్‌’, ‘అమీ తుమీ’, ‘జెంటిల్‌మన్‌’, ‘స‌మ్మోహ‌నం’ వంటి వినూత్నమైన చిత్రాలు చేసిన ఇంద్రగంటి ఈ సారి యాక్షన్ థ్రిల్లర్‌ను తెరకెక్కించబోతున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను చిత్ర యూనిట్ వెల్లడించనుంది. 

No comments