Breaking News

NAGARJUNA entry in bollywood


NAGARJUNA entry in bollywood

టాలీవుడ్ మన్మథుడు, కింగ్ నాగార్జున బాలీవుడ్‌లో రీఎంట్రీ ఇస్తున్నారు. రణ్‌బీర్ కపూర్, అలియా భట్ జంటగా కరణ్ జోహార్ నిర్మాతగా తెరకెక్కుతోన్న ‘బ్రహ్మస్త్ర’. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. అలాగే నాగార్జున కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ నిమిత్తం నాగ్ ముంబై కూడా వెళ్లిపోయినట్లు సమాచారం. అంటే 15 ఏళ్ల తరవాత నాగార్జున మళ్లీ బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నా. శివ’ సినిమా ద్వారా సుమారు 25 ఏళ్ల క్రితం నాగార్జున బాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఆ తరవాత ఖుడా గవా, క్రిమినల్, జఖమ్ చిత్రాల్లో నటించారు. చివరిగా 2003లో ‘ఎల్‌వోసీ కార్గిల్’ చిత్రంలో కనిపించారు. నాగార్జునకు ఎప్పటి నుంచో ఒక హిందీ సినిమా చేయాలని ఉందని, కాకపోతే ఆసక్తికరమైన ప్రాజెక్టు కోసం వేచి చూస్తున్నారని ‘డెక్కన్ క్రానికల్’ పత్రికకు పరిశ్రమకు చెందిన ఓ వ్యక్తి వెల్లడించారు. అయాన్ ముఖర్జీ చెప్పిన కథ నచ్చడంతో నాగార్జున ఈ సినిమాలో చేయడానికి అంగీకరించారని చెప్పారు. అంతేకాకుండా ఆయన అభిమాన నటుడు, ఆప్త మిత్రుడు అయిన అమితాబ్ బచ్చన్ కూడా ఈ చిత్రంలో నటిస్తుండటంతో నాగార్జున నటించడానికి ఒప్పుకున్నారని తెలిపారు.

No comments