SARIONODU INDIAN RECORD
SARIONODU INDIAN RECORD
.. అప్పటి వరకు ఉన్న బన్నీ లుక్‌ను పూర్తిగా మార్చేశారు. చాలా రఫ్‌గా ఎంతకైనా తెగించే యువకుడిగా చూపించారు. అందుకే ఆ చిత్రం మాస్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే ఈ సినిమా వెండితెరపైనే కాదు సామాజిక తెరపై సత్తా చాటింది. భారతీయ సినీ చరిత్రలోనే అరుదైనా రికార్డును సొంతం చేసుకుంది. యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ రాబట్టిన భారతీయ సినిమాగా ‘సరైనోడు’ నిలిచింది. అయితే ఇది తెలుగు వర్షన్‌కు దక్కిన రికార్డు కాదు. హిందీ వర్షన్‌ది. ‘సరైనోడు’ హిందీ వర్షన్‌ను యూట్యూబ్‌లో ఇరవై కోట్లమందికిపైగా వీక్షించారు. యూట్యూబ్‌లో ‘సరైనోడు’ హిందీ డబ్బింగ్‌కు మంచి స్పందన వచ్చింది. వాస్తవానికి 145 మిలియన్ వ్యూస్ వచ్చినప్పుడే ఈ చిత్రం రికార్డు సాధించింది. అప్పటికే అన్ని వ్యూస్ సాధించిన ఏకైక భారతీయ చిత్రం ‘సరైనోడు’. ఇప్పుడు ఏకంగా 200 మిలియన్ వ్యూస్ దాటేసి తనకు సరితూగేవాడు ఎవడూ లేడు అంటున్నాడు ఈ ‘సరైనోడు’. ఒక తెలుగు డబ్బింగ్ సినిమాను ఉత్తరాది జనాలు ఈ స్థాయిలో ఆదరిస్తారని ఎవ్వరూ ఊహించి ఉండరు.
No comments