Breaking News

VARUN SPACE MOVIE RELEASE DATE FIX

VARUN SPACE MOVIE RELEASE DATE FIX


VARUNTEJ
స్పేస్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ కథానాయకుడిగా సంకల్పరెడ్డి దర్శకత్వంలో నటిస్తున్న స్పేస్ మూవీ అందరికి తెలిసిందే .  అయితే ఈ సినిమా కు సంబందించిన లేటెస్ట్ న్యూ అప్డేట్ ఇప్పుడు చిత్రబృందం ప్రకటించింది . ఇ చిత్రం లో వరుణ్ సరసన లావణ్య త్రిపాఠి మరియు అదితిరావు నటిస్తున్నారు  అంతరిక్షం (స్పేస్) నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రం డిసెంబర్ 21న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. హాలీవుడ్ తరహా స్టంట్స్ ఉండబోతున్నాయి. హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ జిబెక్, టోడోర్ లాజరవ్ (జూజి), రోమన్ ఈ సినిమాకు పనిచేశారు. స్పేస్ స్టంట్స్ కోసం ప్రత్యేకమైన సెట్ వేసి షూటింగ్ చేశారు. టాలీవుడ్ చరిత్రలోనే ఇలాంటి సెట్ వేయడం ఇదే తొలిసారు. అంతరిక్షాన్ని తలపించేలా, గురుత్వాకర్షణ లేని ‘జీరో గ్రావిటీ’ సెట్‌ను ఏర్పాటుచేశారు. ఈ సెట్‌లోనే హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ అదితిరావ్ హైదరిపై 3డి స్కాన్ చేశారు. సినిమాకు ఈ టెక్నాలజీ మరింత ఉపయోగపడనుంది.  ఈ సినిమాకు ‘అహం బ్రహ్మస్మీ’, ‘వ్యోమగామి’ టైటిళ్లను పరిశీలిస్తున్నట్లు
సమాచారం. 

No comments