BELLAM KONDA THO KAJAL
BELLAM KONDA THO KAJAL
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ సినీ వారసుడిగా చిత్రసీమలోకి అడుగుపెట్టిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఒక్కోమెట్టు ఎక్కుతున్నాడు. ‘అల్లుడు శీను’తో ఎంట్రీ ఇచ్చిన ఈ మాస్ హీరో.. ‘జయ జానకి నాయక’తో బ్లాక్‌బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ విజయంతో శ్రీనివాస్‌కు అవకాశాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సాక్ష్యం’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే కొత్త దర్శకుడు శ్రీనివాస్ చెప్పిన కథ నచ్చి సినిమా చేయడానికి బెల్లంకొండ శ్రీనివాస్ ఒప్పుకున్నాడు. కాజల్ హీరోయిన్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.
No comments