Breaking News

Jivithantham guthindipothundi " kalyan dev"

Jivithantham guthindipothundi " kalyan dev"
kalyandev

                     విజేత’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందని హీరో కళ్యాణ్ దేవ్ అన్నారు. జులై 12న విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. చిత్ర విజయాన్ని పురష్కరించుకుని ఆదివారం చిత్ర యూనిట్ విజయోత్సవాన్ని నిర్వహించింది. హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్‌లో జరిగిన ఈ విజయోత్సవానికి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరై చిత్రయూనిట్‌ను అభినందించారు.
 ఈ సందర్భంగా హీరో కళ్యాణ్ దేవ్ మాట్లాడుతూ తమను ప్రోత్సహించడానికి వచ్చిన బన్నీకి కృతజ్ఞతలు తెలిపారు
‘థియేటర్లలో ప్రేక్షకుల స్పందన తెలుసుకోవడానికి వైజాగ్, కాకినాడ, రాజమండ్రి, విజయవాడలో రెండు రోజుల పాటు పర్యటించాం. ప్రేక్షకుల స్పందన చాలా బాగుంది. ఈ అనుభవం జీవితాంతం గుర్తుండిపోతుంది. నాన్నలు, విద్యార్థులు ఇలా చాలా మంది సినిమా చూసి గుండెను హత్తుకుందని మెచ్చుకుంటున్నారు.మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన బన్నీకి చాలా థాంక్స్. మా విజేత చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు, మెగా అభిమానులకు నా ధన్యవాదాలు’ అని కళ్యాణ్ దేవ్ అన్నారు.


No comments