Breaking News

NTR teaser AUGUST 5TH




NTR  teaser AUGUST 5th


NTR

   మొన్నటివరకు కాస్త గ్యాప్ తీసుకున్నాడు ఎన్టీఆర్. ఈ సమయంలో తన రెండో కొడుకుకి  నామకరణం చేయడం లాంటి వ్యక్తిగత పనులతో అతను బిజీగా ఉన్నాడు. . ఇప్పుడు మళ్లీ సినిమా సెట్స్‌పైకి రాబోతున్నాడు తారక్. సోమవారం నుంచి ‘అరవింద సమేత…’ కొత్త షెడ్యూల్ మొదలుకానుంది. రామోజీ ఫిలింసిటీలో ప్రారంభంకాబోతున్న ఈ షెడ్యూల్ రెండు వారాల పాటు కొనసాగుతుంది. ఆతర్వాత సినిమా యూనిట్ సభ్యులు అంతా కలిసి పొల్లాచ్చి వెళ్తారు. అక్కడ 10 రోజుల షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్, టైటిల్ ఇప్పటికే విడుదలైంది. ఆగస్టు 15న టీజర్‌ను విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు ఫిల్మ్‌మేకర్స్. అదే రోజున సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించే అవకాశం ఉంది. దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తారనే ప్రచారం ప్రారంభం నుంచే ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అరవింద సమేత…’ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. సెకండ్ హీరోయిన్‌గా ఈషా రెబ్బ నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

No comments